కొత్త రూపంలో కరోనా వైరస్.. భారత్‎లో గుర్తింపు

కరోనా అంతం అయ్యిందనుకుంటున్న సమయంలో ఓ వార్త కలకలం సృష్టిస్తోంది.కరోనా వైరస్ కొత్త రూపంతో మళ్లీ వ్యాప్తి చెందుతుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

 Corona Virus In A New Form.. Identified In India-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా బీఎఫ్ 7 అనే సబ్ వేరియంట్ ను భారత్ లో గుర్తించారు.గుజరాత్ బయో టెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్ ను గుర్తించింది.

కాగా ఇది ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.ముందుగా చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.

ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం, అమెరికా దేశాలకు విస్తరించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే డామినెంట్ వేరియంట్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube