కొత్త రూపంలో కరోనా వైరస్.. భారత్‎లో గుర్తింపు

కరోనా అంతం అయ్యిందనుకుంటున్న సమయంలో ఓ వార్త కలకలం సృష్టిస్తోంది.కరోనా వైరస్ కొత్త రూపంతో మళ్లీ వ్యాప్తి చెందుతుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా బీఎఫ్ 7 అనే సబ్ వేరియంట్ ను భారత్ లో గుర్తించారు.

గుజరాత్ బయో టెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్ ను గుర్తించింది.కాగా ఇది ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.

ముందుగా చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం, అమెరికా దేశాలకు విస్తరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే డామినెంట్ వేరియంట్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?