వైసీపీ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ తనను ప్యాకేజీ స్టార్ అనే సన్నాసులు ఎవరని ప్రశ్నించిన పవన్.
వారిని చెప్పు తీసుకొని కొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనను విమర్శించే వారి పళ్లు చెప్పుతో రాలగొడతానన్నారు.
ఒక్క చేతితో గొంతు పిసికేస్తా అంటూ వ్యాఖ్యనించారు.లండన్ లో పెరిగాననుకున్నారా.
మీలాంటి భాష రాదనుకున్నారా అంటూ మండిపడ్డారు.తను కూడా బాపట్లలో ఉప్పు, కారం తినే పెరిగానంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎనిమిదేళ్ల కాలంలో ఆరు సినిమాలు చేసినట్లు తెలిపారు.రూ.100 కోట్ల నుంచి 120 కోట్లు సంపాదించనన్న ఆయన రూ.33 కోట్ల 37 లక్షల ట్యాక్స్ కట్టినట్లు చెప్పారు.జీఎస్టీ అదనంగా చెల్లించానని పేర్కొన్నారు.తన పిల్లల ఫిక్స్ డ్ డిపాజిట్లతో పార్టీ కార్యాలయం కట్టినట్లు తెలిపారు.2021-22లో రూ.5 కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానన్నారు.