మునుగోడులో ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ దాఖాలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.తమ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దంటూ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
మునుగోడులో స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.ఈ సమయంలో పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది.
అయితే కారు గుర్తును పోలి ఎనిమిది గుర్తులున్నాయని, దాని వలన తాము ఓట్లను నష్టపోతున్నామని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది.ఈ నేపథ్యంలోనే ఆ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని తొలగించాలని న్యాయస్థానాన్ని కోరిన విషయం తెలిసిందే.