మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే ఆ సినిమా 100 కోట్ల వసూళ్ల ను దక్కించుకుంటుందని అంతా భావించారు.కానీ ఆ సినిమా కనీసం పాతిక కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్ట లేకపోవడం తో బయ్యర్స్ నిట్ట నిలువునా మునిగి పోయిన విషయం తెలిసిందే.
ఆయన ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ చేసిన తప్పిదాల కారణంగానే నిరాశ పరిచిందంటూ ఆచార్య ప్లాప్ తర్వాత చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఆ విషయం పక్కన పెడితే తాజాగా విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
గాడ్ ఫాదర్ విజయం తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా లపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.గాడ్ ఫాదర్ సినిమా ని ముందస్తు గా విడుదల చేయడానికి ముందు అన్ని ఏరియాల్లో అమ్మకుండా నిర్మాత లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది.
కనుక బ్రేక్ ఈవెన్ ఇతర విషయాల గురించి ఈ సినిమా విమర్శల పాలు అవ్వలేదు.పెద్ద ఎత్తున సినిమా విడుదల అవుతుందని అంతా భావించారు.
అన్నట్లుగానే గాడ్ ఫాదర్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది.అంతే కాకుండా 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యం లో తదుపరి సినిమాల విషయం లో భారీ అంచనాలు ఉన్నాయి.అంతే కాకుండా కలెక్షన్స్ విషయం లో భారీగా ఉంటాయని అంతా నమ్ముతున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన గాడ్ ఫాదర్ సినిమా వచ్చే సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న రెండు సినిమా ల టార్గెట్ ను భారీగానే సెట్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.