జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీమంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.విశాఖ గర్జనకు వచ్చిన మంత్రులపై ఉద్దేశపూర్వకంగా జనసేన కార్యకర్తలతో దాడి చేయించారని, అలాంటి వారికి పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తున్నారు అని అన్నారు.
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడా లేకపోతే ఫ్యాక్షన్ ముఠాకు నాయకుడా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మూడు రోజులు షూటింగ్ లేక ఖాళీ దొరికేసరికి విశాఖ వచ్చి ఇలాంటి అల్లర్లు చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు.పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు అంటూ వ్యాఖ్యనించారు.