శ్రీను వైట్ల… ఫ్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు ఒకప్పుడు ఎన్నో ఘనమైన హిట్లనే సొంతం చేసుకున్నవాడే.నేటి దర్శకుల్లో కామెడీ కి మారుపేరుగా శ్రీను వైట్ల పేరు ఉంటుంది అనడం లో ఎలాంటి అతియోక్తి లేదు.
తన తొలి సినిమా నీ కోసం నుంచే అతడిలో ఒక విభిన్న దర్శకుడు ఉన్నాడనే విషయం అందరికి అర్దం అయ్యింది.ఒక్కో సినిమాకు ఒక్కో రకం కొత్త కామెడీ పాత్రను సృష్టించడం లో ఆయనకు ఆయనే సాటి.
చాలా ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెడీ పేర్లు కానీ, మీమ్ లు కానీ డెబ్బై శాతం శ్రీను వైట్ల అద్భుతమైన ఒక సృష్టి అని చెప్పవచ్చు.
సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపొయినట్టు, బయపడినట్టు కాదు.
తనలోని నూతన దైర్యాన్ని కుడబెట్టుకోని సరికొత్త ఉత్తేజం తో మళ్లీ పురుడు పోసుకుంటాడు.ఇక ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను పక్కన పెడితే ఆయన సృష్టించిన కామెడీ పాత్రలు ఎంతో విచిత్రంగా ఉంటూ నవ్వు తెప్పిస్తాయి.
నాటి రోజుల్లో జంధ్యాల, ఆ తర్వాత రోజుల్లో ఈ వి వి సత్య నారాయణ ఇక ఇప్పుడు శ్రీను వైట్ల వారికంటూ ఒక ప్రత్యేక శైలి లో మంచి అభిరుచి ఉన్న దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీ లో కేవలం సినిమాలు తీయడం ఒక ఎత్తయితే, మంచి స్నేహాలు కలిగి ఉండటం మరొక ఎత్తు.ఒక గజాల, ఒక బొక్క సుబ్బారావు, హ్యాపీ రెడ్డి, MC మూర్తి, పట్నాయక్, చిట్టి నాయుడు, పద్మ నాభ లాంటి ఎన్నో నవ్వు తెప్పించే పాత్రలను సృష్టించిన గోపి మోహన్, కొన వెంకట్ వంటి ఆస్థాన రచయితలతో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు.ఇక గత వైభవాన్ని తిరిగి పొంది శ్రీను వైట్ల మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.