పిచ్చి పిక్స్, టైటానిక్ శిథిలాలు చూసేందుకు మహిళ రూ.2 కోట్లు ఖర్చు..

అస్సలు మునిగిపోదని భావించిన టైటానిక్ షిప్ ఊహించని రీతిలో మునిగిపోయి వేలాది మందిని జల సమాధి చేసింది.నేటికీ ఈ ఓడ కథ విషాదాంతం కావడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది.

 Woman Spends Rs. 2 Crores To See Crazy Pics, Titanic Wreckage , Titanic, Viral-TeluguStop.com

అయితే టైటానిక్ సినిమా చూసిన తర్వాత అనేకమంది ప్రజలు ఈ షిప్ శిథిలాలను చూడాలని ఎంతో ఆశపడ్డారు.కాగా ఒక మహిళ ఈ షిప్ అవశేషాలను చూడాలనే కోరికతో ఏకంగా 30 సంవత్సరాలపాటు కష్టపడి రూ.2 కోట్ల డబ్బులు దాచుకుంది.ఇటీవల, ఈ మహిళ తన కలను నెరవేర్చుకుంది.

ఆ మహిళ తన కలను సాకారం చేసుకున్న వీడియో క్లిప్‌ను బీబీసీ షేర్ చేసింది.

రెనాటా అనే మహిళ ఈ అనుభూతి కోసం 2,50,000 డాలర్లు అనగా రూ.2 కోట్లకు పైగా వెచ్చించింది.టైటానిక్ శిథిలాలను ప్రత్యక్షంగా వీక్షించాలనే తపన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమెలో మొదలైందట.

మరో విశేషం ఏంటంటే, ఆ మహిళ సముద్ర శాస్త్రాన్ని కూడా కెరీర్‌గా సెలెక్ట్ చేసుకుంది.టైటానిక్ శిథిలాలను చూసిన మొదటి వ్యక్తి తానే కావాలని కూడా కోరుకుంది.

దురదృష్టవశాత్తు, ఆమె ఓషనోగ్రఫీ క్లాస్సేస్‌కి వెళ్లిన వారంలోపే, టైటానిక్ శిథిలాలు కనుగొనబడ్డాయి.ఫలితంగా, ఆ మహిళ తన కెరీర్ మార్చుకుంది.

శిథిలాలను సందర్శించడానికి పొదుపు చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.తన కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె 30 సంవత్సరాలకు పైగా మనీ సేవ్ చేసింది.

ఇటీవల, టైటానిక్ శిథిలాలను విజిట్ చేసింది.

ఈ మహిళ టైటానిక్‌ను చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆమె సంకల్పానికి కొందరు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతుంటే.ఇంతలా టైటానిక్ చూడాలానేంత పిచ్చి ఈమెలో తప్ప మిగతా ఎవరిదో ఉండదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అద్భుతమైన వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube