మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధానాధికారిని బీజేపీ నాయకులు కలిశారు.బీజేపీ ముఖ్య నేతలైన తరుణ్ చుగ్, రామచంద్రరావులు ఈసీని కలిశారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.అదేవిధంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్వల్ప వ్యవధిలో 25 వేల కొత్త ఓట్లు ఎలా వస్తాయని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.బోగస్ ఓట్లు చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ తన మినీ సచివాలయాన్ని మునుగోడులో ఏర్పాటు చేసుకున్నారన్నారు.ఈ క్రమంలో ఉపఎన్నిక సజావుగా సాగాలంటే కేంద్ర ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని ఈసీని కోరామని తెలిపారు.
నాలుగేళ్లుగా మునుగోడులో విధుల్లో ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని ఈసీని కోరామని వెల్లడించారు.