నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ సినిమాలు తక్కువ అనే చెప్పాలి.ఈయన తన కెరీర్ మొత్తం చూసుకుంటే ఒకటి రెండు మినహా మిగతావన్నీ డిజాస్టర్ సినిమాలే.
అయితే ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార’ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కించారు.
ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేస్తున్నాడు.మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక తాజాగా కళ్యాణ్ రామ్ లైనప్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త అందుతుంది.
కళ్యాణ్ రామ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

సంపత్ నంది గోపీచంద్ తో సీటిమార్ వంటి హిట్ సినిమాను తెరకెక్కించాడు.ఆ తర్వాత మరో సినిమా చేయని ఈ డైరెక్టర్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు కథ చెప్పాడని.ఆ కథ కళ్యాణ్ రామ్ కు కూడా నచ్చడంతో ఓకే చెప్పాడని అంటున్నారు.
కళ్యాణ్ రామ్ ఎప్పటి నుండో నిర్మాత హరి నిర్మాణంలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి సంపత్ నంది కథ నచ్చడంతో వీరి కాంబో లోనే తెరకెక్కే అవకాశం ఉందని ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.మరి ఈ రూమర్ లో నిజం ఎంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.