తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం వరుస సినీమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా అవకాశాలు ఎక్కువ అవడంతో ఆమె ఇటీవల జబర్దస్త్ షో నీ కూడా వదిలేసిన విషయం తెలిసిందే.అయితే కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
తరచూ వెకేషన్ లకు వెళ్తూ అందుకు సంబందించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటి కప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అలాగే సమయం దొరికినప్పుడల్లా తన భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ.
అందుకు సంబంధించిన ఫోటోలో వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో తన భర్త పక్కన లేనప్పుడు కనపడుతుంది ఏ విధంగా ఉంటుందో అన్న విధంగా ఆ వీడియోని షేర్ చేసింది.బెడ్రూంలో బెడ్ పై పడుకున్న అనసూయ భర్త పక్కన లేనందుకు తెగ ఫీలైపోతోంది.
కాగా అనసూయది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే.అనసూయకి తన భర్త భరద్వాజ్ అంటే అమితమైన ప్రేమ.
ఇక అనసూయ తాజాగా షేర్ చేసిన వీడియోను బట్టి చూస్తే ప్రస్తుతం ఆమె ఏదో షూటింగ్ కోసం వేరే ఊరికి వెళ్లినట్లు కనిపిస్తోంది.ఈ క్రమంలోనే ఒంటరితనాన్ని ఫ్యాన్స్ కి వీడియో రూపంలో తెలియజేసింది.ఇకపోతే అనసూయ షేర్ చేసిన ఆ వీడియో పై కొంతమంది పనిగా స్పందిస్తుండగా మరికొందరి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.అయితే అనసూయకు ఇదేం కొత్తేం కాదు.
ఇప్పటికే ఆమె పళ్ళు సార్లు ఈ విధంగా కాంట్రవర్సీలకు క్రియేట్ చేసే విధంగా వీడియోలను, ట్వీట్స్ నీ షేర్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.