మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వరుస సినిమాలు చేస్తున్నాడు.మరి ఈయన చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.
మరొక రెండు వారాల్లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.
అయితే విడుదల తేదీ దగ్గర అవుతున్న ఇంకా ఈ సినిమాపై అనుకున్నంత బజ్ లేదు.ఇందులో చిరు మాత్రమే కాదు సల్మాన్ ఖాన్, నయనతార ఉన్నప్పటికీ బజ్ క్రియేట్ కాకపోవడం గమనార్హం.
మరి ముందు ముందు అయినా ఈ సినిమా బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.
ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడు పోయాయని తాజాగా ఒక వార్త వైరల్ అయ్యింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ సొంతం చేసుకుందట.
ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.మరి వచ్చే నెల రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
చూడాలి ఈ సినిమా అయినా ఆచార్య ప్లాప్ ను మరిపిస్తుందో లేదో.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.