సూర్యాపేట జిల్లా:1947 సెప్టెంబర్ 17 న తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
తెలంగాణ జాతీయ సమైక్యతను కళాకారులు పాటల రూపంలో గొంతెత్తి చాటారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన అంబెడ్కర్ జీవిత చరిత్ర నాటకం అందరిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాటి తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధులను,కళాకారులను పూలమాలలు,శాలువలతో సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడాతూ నాటి తెలంగాణ పోరాట యోధులతో కలసి పనిచేసిన మన పెద్దలను గౌరవించుకుంటూ,ఉద్యమాన్ని ఉత్తేజపరిచేందుకు ప్రదర్శించిన కలలను గుర్తు చేసుకుంటూ ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు.700 లకు పైగా దేశాలుగా విడిపోయిన భారతదేశం మహాత్మాగాంధీ అహింసా నినాదంతో దేశం మొత్తం తిరిగి అంతరాలతో నిండిన సమాజాన్ని ఏకం చేశాడని అన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం రాజుల పాలనలో ఉందన్నారు.
నాడు భూమి,భుక్తి,విముక్తికి కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు.దీంతో నిజాం రాజు లొంగి దేశాన్ని భారత దేశంలో కలుపుతానని చెప్పగా ప్రధాని నెహ్రూ ఆదేశాలతో అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు.
నాడు తెలంగాణ రాచరిక నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసిందని అన్నారు.చదువుకు దూరంగా ఉన్న వర్గాలలో చదువు ఆవశ్యకతను తెలుసుకొని ఉన్నత చదువులు చదివిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కు రాజ్యాంగ నిర్మించే బాధ్యతను అప్పగించారన్నారు.అంతరాలు లేని సమాజం కోసం నిర్మించిన రాజ్యాంగం నాగరిక సమాజం వైపుకు తీసుకెళుతుందన్నారు.గాంధీజీ కలలు నేడు తెలంగాణలో సాకారమవుతున్నాయని, గంగా జమునా నదుల మాదిరిగా గత ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కెసిఆర్ అద్భుత నాగరిక సమాజాన్ని నిర్మించారన్నారు.
దేశమంతా మనవైపు చూస్తున్నారని,తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల పండుగలను కలిసి జరుపుకునే అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది తెలంగాణ అన్నారు.దేశానికి తెలంగాణ నమూనాగా ఉండే పద్ధతిని ఈ తరాలకు తెలియజేయడం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు.
శాంతి, సుస్థిరతలే అభివృద్ధికి నాంది అని శాంతియుతంగా లేని సమాజంలో ఎప్పుడు అభివృద్ధి ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అద్భుతమైన నవ నాగరిక సమాజంగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.అంతకు ముందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బాబాసాహెబ్ బి.ఆర్.అంబెడ్కర్ జీవిత నాటకం ఒక అద్భుత ఘటం ఎంతో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,ఎస్పీ రాజేంద్రప్రసాద్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య,మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ,మార్కెట్ ఛైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,ఎంపీపీలు,జడ్పిటిసిలు,కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు,స్వతంత్ర సమరయోధులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.