బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాను తీసిన ఆర్క మీడియా మరొక నిర్మాణ సంస్థ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా కలిసి తీసిన సినిమా పంజా.పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 2011లో విడుదలైంది.
అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో నిరాశకు గురిచేసింది.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా సారా జైన్ డయాస్, అంజలి లావణ్య హీరోయిన్స్ గా నటించారు.
అంతే కాదు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక ముఖ్యమైన పాత్రలో అడవి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.అయితే ఈ సినిమాలో అడవిశేష్ పాత్ర మరోలా ఉంటుందని దర్శకుడు చెప్పి ఒప్పించాడని ఆ తర్వాత పాత్ర మరోవైపు టర్న్ అయిందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాంబు పేల్చినంత పని చేశాడు.
ఇక అసలు విషయంలోకి వెళితే పంజా సినిమా కోసం మొదటగా దర్శకుడు విష్ణువర్ధన్ మరొక టైటిల్ అనుకున్నాడట అది ‘ది షాడో’. ఈ చిత్రపు షూటింగ్ కోల్ కతా లో మొదలవగా వర్కింగ్ టైటిల్ గా తొలినాళ్ల నుంచి ది షాడోని పరిగణలోకి తీసుకున్నారు.
అయితే అదే సమయంలో ఇది కేవలం ఒక వర్కింగ్ టైటిల్ అంటూనే మీడియాకు హింట్లు వచ్చారు చిత్ర బృందం.సినిమా పూర్తయి తర్వాత టైటిల్ మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు అందుకు అనుగుణంగా ఈ సినిమా కోసం పవర్, పటేల్, తిలక్, కాళీ అనే మరో నాలుగు టైటిల్స్ కూడా దర్శక నిర్మాతలు పరిగణలోకి తీసుకున్నారు.
అయితే ఇవన్నీ పక్కకు పెట్టి చివరకు పంజా అనే టైటిల్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చేయడంతో దసరాకి ఈ చిత్రం పంజా పేరుతో ప్రకటిస్తూ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు చరిత్ర బృందం.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర తీరు అలాగే ఇతర పాత్రధారుల నటన, యాక్షన్ సీన్స్, కథ అన్నీ కూడా ప్రేక్షకుల చేత రిజెక్ట్ చేయబడ్డాయి, ఎంతో అనాసక్తిగా ఈ సినిమా సాగింది ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కలేదు, ఓవర్సీస్ లో సైతం ఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు, పవన్ కళ్యాణ్ డిజాస్టర్ లిస్టులో ఈ సినిమా కూడా చేరింది.ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ కూడా అడ్రస్ లేకుండా పోయారు.