గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాల నిర్మాతలతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ రెండు చిత్రాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేట్లు తగ్గించలేదని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం విచారణకు స్వీకరించింది.
పన్ను రాయితీ పొందిన మేర డబ్బును ఆయా నిర్మాతల నుంచి తిరిగి రాబట్టాలని పిటిషన్ లో కోరారు.అదేవిధంగా రుద్రమదేవి చిత్రానికి తెలంగాణలోనూ, శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయితీ ఇచ్చారని వెల్లడించారు.
కానీ ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం.ఆయా నిర్మాతలను, రెండు ప్రభుత్వాలను వివరణ కోరింది.తమ నోటీసులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.