కేజిఎఫ్ సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.మొదటి పార్ట్ తో పోలిస్తే రెండవ పార్ట్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా రూ.1000 కోట్ల కు పైగా వసూలు సాధించడం తో ఆ సినిమా లో నటించిన హీరో యష్ మరియు హీరోయిన్ శ్రీ నిధి శెట్టి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఆ సినిమా కు దర్శకుడిగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుసగా సినిమా లను చేస్తున్న విషయం తెలిసిందే.కానీ హీరో మరియు హీరోయిన్ మాత్రం పెద్ద గా సినిమాలు చేయక పోవడం తో అభిమానులు నిరుత్సాహం ను వ్యక్తం చేస్తున్నారు.
హీరో ఒక బలమైన కథ కు కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటే సరే, కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు సినిమాలు కమిట్ అవ్వడం లేదు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
గతంలోనే కమిట్ అయిన కోబ్రా సినిమా తో ఈ అమ్మడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కోబ్రా తో రాబోతున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బిజీ అవుతుందా అనేది చూడాలి.ఈమెకు వచ్చిన రెండు మూడు సినిమాలు ఆఫర్ల ను తిరస్కరించిందని, దాంతో ఈమెకు ప్రస్తుతం ఆఫర్లే కరువయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోబ్రా సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా ఈమె మూడు నాలుగు ఆఫర్లను దక్కించుకోవడం ఖాయమని తద్వారా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈమె బిజీ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ ప్రేక్షకులు మాత్రం ఈమె అందంగా ఉంటుంది కానీ అభినయం విషయం లో చాలా పూర్ అందుకే ఈమె కు ఆశించిన స్థాయి లో ఆఫర్లు రావడం లేదని కోబ్రా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఈమె కు వరుసగా ఆఫర్లు ఎలా వస్తాయని భావిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
కానీ కోబ్రా సినిమా పై ఆమె చాలా నమ్మకం తో ఉంది తప్పకుండా తనని స్టార్ గా నిలబెడుతుందని ఉద్దేశం తో తాజాగా ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.మరి ఆమె ఎదురు చూపులు మరియు ఆమె అభిమానుల యొక్క ఎదురు చూపులు ఎంత వరకు సాధ్యమవుతాయి అనేది చూడాలి.