దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.మొదటి నుంచి లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.
చివరి వరకు అలానే కొనసాగాయి.అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,564 పాయింట్లు లాభపడి 59,537కి పెరిగింది.నిఫ్టీ 446 పాయింట్లు ఎగబాకి 17,759కి చేరుకుంది.
రియాల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.