ఇండస్ట్రీలో నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు: నిత్యామీనన్

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పలు భాషలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం తనని ఒకవ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానని వేధిస్తున్నారని అలాగే కొత్త కొత్త నెంబర్ల నుంచి తనకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

 I Have Many Enemies In The Industry Nithya Menon Nithya Menon, Film Industry,tir-TeluguStop.com

ఇలా తరచు ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచినటువంటి నిత్య మీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు ధనుష్ తో కలిసి ఈమె నటించిన తిరుచిత్రంబలం విడుదలయ్యి అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనని ఒక వ్యక్తి మోసం చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు.ఈ క్రమంలోని తనకు ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు ఉన్నారని, మనం ఎదుగుతుంటే ఓర్వలేక మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారని ఈమె తెలిపారు.

Telugu Bheemla Nayak, Dhanush, Kollywood, Nithya Menon, Tiruchitambalam, Tollywo

ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎప్పుడైతే వినమో అప్పుడే మన గురించి ఇలాంటి వదంతులు పుట్టిస్తారని ఇలా మన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే తాను ఎంతోమంది దర్శకులతో హీరోలతో సినిమాలు చేశానని అయితే ఎక్కడ నాకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తన వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా అందరికీ తెలిసిందేనని ఈమె చెప్పారు.ఇలా కొందరు నచ్చని వ్యక్తులే నా గురించి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube