వయసు పైబడక ముందే వైట్ హెయిర్ తో సతమతం అవుతున్న వారి సంఖ్య ఇటీవల రోజుల్లో బాగా పెరిగిపోతోంది.పోషకాల కొరత, థైరాయిడ్, ఒత్తిడి, స్మోకింగ్, రసాయన జుట్టు రంగులు మరియు జుట్టు ఉత్పత్తులను వాడటం వంటివి అకాల తెల్ల జుట్టుకు కారణమవుతుంటాయి.
ఏదేమైనా చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడిందంటే.ఇక వారు దాన్ని కవర్ చేసుకోవడానికి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఒకవేళ మీరు ఈ జాబితాలో ఉంటే.అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే మీ తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారడం ఖాయం.మరి ఇంతకీ ఆ హెయిర్ ఫ్యాక్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, మూడు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి కాయ ముక్కలు వేసి చిన్న మంటపై ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి.చివరిగా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని మరో రెండు, మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు వేయించుకున్న మిరియాలు, ఉసిరి కాయ ముక్కలు, కరివేపాకు, మెంతులను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర కప్పు గ్రీన్ టీ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి.షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మీ వైట్ హెయిర్ క్రమక్రమంగా బ్లాక్ అవుతుంది.