1.రేపు పాఠశాలలకు సెలవు
ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 27 శనివారం సెలవుదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు.
2.నేడు విశాఖలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించరున్నారు.విశాఖ బీచ్ క్లీనింగ్, రీ సైకిలింగ్, ప్లాస్టిక్ వినియోగంపై ఎంఓయూ కుదుర్చుకోనున్న జగన్.
3.నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
నేడు కుప్పంలో మూడో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు.ఆర్ అండ్ బి బంగ్లాలో స్థానిక సంస్థలపై ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించినన్నారు.
4.రెండో రోజు కార్మిక శాఖ జాతీయ సదస్సు
నేడు తిరుపతిలో రెండో రోజు కార్మిక శాఖ జాతీయ సదస్సు నిర్వహిస్తోంది.సదస్సులో లేబర్ కోర్స్ ,రిజిస్ట్రేషన్, లైసెన్స్ విధానాలపై చర్చించనున్నారు.
5.సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
నేడు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
6.ఎమ్మెల్సీ అనంత బాబు కేసు
నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరోసారి రాజమండ్రి ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కోర్టులో విచారణ జరుగుతుంది.
7.కాంగ్రెస్ కు ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
8.బండి సంజయ్ పాదయాత్ర పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రను ఆపాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది.
9.పాత బస్తీలో హై అలెర్ట్
హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు.భద్రత బలగాల సంఖ్యను పెంచారు.నేడు శుక్రవారం కావడంతో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగబోతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
10.రాజా సింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : షర్మిల
గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
11. కొత్తగా 33 బీసీ గురుకులాలు
తెలంగాణలో కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలతో పాటు 15 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
12.శ్రీశైలం గేట్లు మూసివేత
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేటులను అధికారులు మరోసారి మూసివేశారు.
13.సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష సెప్టెంబర్ 4 న నిర్వహించనున్నారు.
14.తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు
సెప్టెంబర్ 2 నుంచి తెలుగు యూనివర్సిటీలు వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
15.ఉద్యాన డిప్లమో కోర్సుల్లో సీట్లు
శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు రెండేళ్ల ఉద్యాన డిప్లమో కోర్సుల్లో సీట్ల సంఖ్యను 80 నుంచి 120 కి పెంచుతూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
16.తెలంగాణ లో డెంటల్ పీజీ, సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణలో పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
17.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.యూపీ సీఎం యోగి కి సుప్రీం లో ఊరట
యూపీ సీఎం యోగి అదిత్య నాథ్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.2007 లో సీఎం విద్వేష పూరితంగా ప్రసంగించినట్టు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
19.రాహుల్ పై గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
నా రాజీనామాకు రాహుల్ గాంధీ నే కారణం అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నభి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47, 650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,980
.