ఆంటీ అని పిలిచేవాళ్లపై అనసూయ సీరియస్ కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం హాట్ టాపిక్ అయింది.ఆ పదంలో తప్పు లేదని అనసూయ ఎందుకంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారో తమకు అర్థం కావడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఆంటీ అనే పదానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.లాటిన్ పదాలలో ఒకటైన అమిటా అనే పదం నుంచి ఆంటీ అనే పదం పుట్టింది.
ఫ్రెంచ్ పాత పదం అయిన అంటే కూడా ఆంటీ పదం పుట్టుకకు కారణమని కొంతమంది భావిస్తారు.ఈ రెండు పదాలకు కుటుంబ సంబంధం అని అర్థం వస్తుంది.
ఆంటీ అంటే అత్త, తండ్రి సోదరి, పిన్ని అనే అర్థాలు వస్తాయి.అయితే కొంతమందిలో ఈ పదంపై వ్యతిరేకత రావడానికి కూడా కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి.
పాతకాలంలో పిల్లలు లేని మహిళలను ఆంటీ అని పిలిచేవారు.
కొంతమంది ఈ పదాన్ని తప్పుగా వాడటం వల్ల కూడా కొంతమందిలో ఈ పదంపై నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది.
స్టార్ యాంకర్ అనసూయ కొంతమంది ఆంటీ అనే పేరుతో తనను కావాలని టీజ్ చేస్తుండటంతో వాళ్లపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.అనసూయ ఒక విధంగా కరెక్ట్ అయితే మరో విధంగా రాంగ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే ఆంటీ అని పిలిచినంత మాత్రాన ఆమె చెప్పిన వాళ్లపై కేసులు పెట్టడం కూడా సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అయితే కావాలని ఆమెను టార్గెట్ చేసి పదేపదే హర్ట్ చేసేలా పిలిస్తే మాత్రం చట్టప్రకారం కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.