టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా మరొక వారం రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.
ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మొదటి సారి విజయ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలతో పాటు.ఫ్యాన్ డమ్ టూర్ కూడా స్టార్ట్ చేసి దేశం మొత్తం చుట్టేస్తున్నారు.
అయితే మరొక 5 రోజుల్లో రాబోతున్న ఈ సినిమాకు ఒక సమస్య వచ్చి పడింది.
బాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.
ఏ సినిమా అక్కడ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఇక ఇప్పుడు లైగర్ సినిమాకు కూడా ఇదే ఫీవర్ నడుస్తుంది.
ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతుంది.
మరో ఈ క్రంమలోనే బాయ్ కాట్ లైగర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో హాట్ టాపిక్ చర్చ జరుగుతుంది.మరి ఈ సినిమాను ఇలా ట్రెండ్ చేయడానికి కారణం బాలీవుడ్ స్టార్స్ అనన్య పాండే, కరణ్ జోహార్ అని తెలుస్తుంది.వీరు డ్రాగ్ అడిక్టర్స్ అంటూ ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇందుకు విజయ్ కూడా అన్ స్టాపబుల్ లైగర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నాడు.చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత భారీ అంచనాలు క్రియేట్ చేస్తుందో లేదో.