తెలంగాణలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపించడం లేదన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు ఎక్కువగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో… 2014 తర్వాత నుండి తెలంగాణ టీడీపీ కీలక నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు.
కానీ మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి కొత్తకోట దయాకర్ రెడ్డి ఎప్పటినుండో టీడీపీకి వీర విధేయుడుగా ఉంటూ రాణిస్తున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తెలంగాణ టీడీపీ పార్టీలో కీలక నేతగా రాణిస్తూ ఉన్నారు.
ఆయన భార్య సీత దయాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా మాత్రమే కాదు ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు.
ఇదంతా పక్కన పెడితే ఏప్పటినుండో తెలంగాణ టిడిపిలో రాణిస్తున్న దయాకర్ రెడ్డి.
తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవరకద్రలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడక తప్పడం లేదని భావోద్వేగంతో కంటతడి పెట్టడం జరిగింది.ఇక ఇదే సమయంలో కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళ్లనున్నట్లు కొత్తకోట దయాకర్ రెడ్డి తన పుట్టినరోజు నాడు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.