ఛాలెంజ్ విసిరే పాత్రల కోసం చూస్తున్నా .. అనుపమ పరమేశ్వరన్

దక్షిణాదిన ఇటు హీరోయిన్ గా అటు కథానాయిక ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.ముక్కుసూటి తనం ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.కోవిడ్ తరువాత స్పీడ్ పెంచిన ఈ భామ రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.” కార్తి కేయ 2” తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన “కార్తికేయ‌ 2” చిత్రాన్ని టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ

 Looking For Challenging Roles Anupama Parameswaran Anupama Parameswaran, Toll-TeluguStop.com

ఈ సినిమాలో నా పాత్రకు థియేటర్స్ లలో ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అది నాకు మంచి ఎనర్జీ ని ఇచ్చినట్లు అనిపించింది.ఈ సినిమా చూసిన వారందరూ చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉందిచందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను.

ప్రతి కథకు కంటెంట్ అనేది చాలా ముఖ్యం చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు మనుషుల్లో ఉన్న మంచితనాన్ని నేను దైవంగా బావిస్తాను.ఈ సినిమాలో లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.

అందుకే ఈ సినిమా కథ నచ్చడంతో నాకొచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ ను కూడా వదులుకున్నాను లొకేషన్స్ మారుతూ షూటింగ్ చేయడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది.అలాగే మంచు గడ్డ కట్టే ప్రదేశంలో షూటింగ్ చేయడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అందరూ జేమ్స్ బాండ్ టైప్ లో ఎంట్రీ ఇచ్చావు అంటున్నారు అలాగే కొన్ని చోట్ల హీరో ను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు.అయితే కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది.

రౌడీ బాయ్స్ లో ఎక్కువ గ్లామర్ గా వుండాలని చేసిన పాత్ర కాదు .స్విచ్వేషన్ డిమాండ్ మేరకు ముద్దు సీన్స్ లలో నటించాను.75 ఇయర్స్ అయినా కూడా విమెన్ ఏంపవర్మెంట్ అనేది ఈక్వల్ గా ఉంది అనుకుంటున్నాను.అయితే పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారు అని చెప్పడం వలన ఇంకా మహిళలు వెనుకబడి ఉన్నారనే బావన గురి చేస్తుంది.

ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ముందుకు వెళుతున్నారు.నా చిన్నప్పుడు స్కూటీ పై ఆగష్టు 15 న ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని తిరిగేదాన్ని.

నేను ఎక్స్పరమెంటల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను.నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ ఉండాలి అలాంటి పాత్రలు నాకు నచ్చుతాయి .ఒక ఆర్టిస్ట్ గా ఎన్ని లాంగ్వేజెస్ కుదిరితే అన్ని లాంగ్వేజెస్ చేయాలని ఉంటుంది.అది నాకు నిర్మాతకు , దర్శకులకు కూడా స్పాన్ పెరుగుతుంది.

కార్తికేయ నెక్స్ట్ పాత్రలో నా పాత్ర ఉంటుందో లేదో తెలియదు.దాని గురించి నేను దర్శక, నిర్మాతలను కూడా అడగలేదుఇంతకుముందు టాలీవుడ్ అంతా బాలీవుడ్ వైపు చూసేవారు.

అయితే ఇప్పుడు రాజమౌళి గారు వచ్చిన తరువాత బాహుబలి, కె.జి.యఫ్ సినిమాలా తరువాత ఆ ట్రెండ్ మారిపోయింది.ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అయ్యిందిప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

మరో రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.

అలాగే 18 పేజెస్ సినిమా వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube