తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు కరుణ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు కరుణ కుమార్.
ఇది ఇలా ఉంటే కరుణకుమార్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా కళాపురం.జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
ఇకపోతే ఇక్కడ అందరూ కళాకారులే అనేది ఈ సినిమా యొక్క ట్యాగ్ లైన్.ఇదొక మధ్య తరగతి మనుషులకు సంబంధించిన కథ.
అలాగే ప్రస్తుత సమాజం పై సెటైరికల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో సత్యం రాజేష్, సంచిత పూనాచ, కాషిమ రఫీ, చిత్రం శ్రీను, రుద్ర, ఆంటోని ప్రధాన పాత్రల్లో నటించారు.
కాగా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ట్యాబ్ లోనే ట్రైలర్ ని విడుదల చేసిన పవన్ కల్యాణ్ ట్రైలర్ చూస్తూ నవ్వుల్లో మునిగితేలారు.ఈ మధ్య కాలంలో పవన్ ఓ మూవీ ట్రైలర్ చూస్తూ నవ్వడం ఇదే కావడం విశేషం అని చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కాగా కళాపురం సినిమా మొత్తం కరీంనగర్ లోని ధర్మపురి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.ఈ సినిమాను ధర్మపురిలో 42 రోజులు పాటు షూటింగ్ చేశారట.ఈ నెల 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.ఇటీవలే వైరల్ ఫీవర్ బారిన పడిన పవన్ కళ్యాణ్ ఒక వారంలోనే కోరుకున్నప్పటికీ వైద్యులు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు.