గౌతమ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా.. నమ్రత మాటలకు అర్ధం అదేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య హీరోయిన్ నమ్రత గురించి మనందరికీ తెలిసిందే.కోడలిగా గట్టమనేని కుటుంబ బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది నమ్రత.

 Namratha Hint On Gautham Carrier, Namrata, Mahesh Babu, Gautham , Tollywood-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత తనకి తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అదేవిధంగా మహేష్ బాబు గురించి మహేష్ బాబు సినిమాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఒక విషయాన్ని వెల్లడించింది నమ్రత.

అదేమిటంటే తమ వారసుడు గౌతమ్ కృష్ణ ఎగిరేందుకు టైం వచ్చింది.

ఇక దేనినైనా చేయగలవు అన్న నమ్మకం కలిగింది అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది నమ్రత.త్వరలోనే నువ్వు నీ మార్పు ప్రపంచానికి చూపిస్తావు అని నమ్రత రాసుకొచ్చింది.

అయితే నమ్ముతా గౌతమ్ కృష్ణ గురించి ఈ విధంగా రాయడం వెనుక ఏమై ఉంటుందా అని సూపర్ స్టార్ అభిమానులు రకరకాల ఊహాగానాలు సాగిస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు ఫ్యామిలీ ఇటీవలే వెకేషన్ మూడ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబుz నమ్రత తో పాటుగా సితార,గౌతమ్ కూడా వెళ్లారు.ఇక ఆ ఫోటోలను పెట్టి చూస్తే గౌతమ్ పెద్దవాడిలా కనిపిస్తున్నాడు.

అయితే ఫోటోలను మరింత పరిశీలిస్తే గౌతమ్ కృష్ణకు ఇప్పుడిప్పుడే నునుగు మీసాలు వస్తున్నాయి.కాగా గౌతమ్ కృష్ణ అత్యంత సాహసోపేతమైన పారా గ్లైడింగ్ చేశాడు.నిజానికి ఎలాంటి భయం,బెదురు లేకుండా అతడి విన్యాసాలు చూసి నమ్రత సైతం షాక్ అయినట్టే కనిపిస్తోంది.తన వారసుడు,మహేష్ బాబుకు మరో ప్రతిబింబం.ఏదీ కూడా తనని బాధించలేదు. చలి, ఎండ,మంచు ఎంతో నిశ్శబ్దంగా ఉంటాడు.

నీవు నేర్చుకున్న పారాగ్లైడింగ్ పాఠాలు చూసి నాకు గర్వంగా ఉంది.ఇక నువ్వు ఎగిరేందుకు టైం వచ్చింది.

నువ్ ఏదైనా చేయగలవన్న నమ్మకం నాకు వచ్చింది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు వేడుక రోజు ఈ విషయాన్ని వెల్లడించింది నమ్రత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube