పల్నాడు జిల్లా,చిలకలూరిపేట పట్టణం,రాష్ట్రంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని రజక కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడో విడత కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తో కలిసి మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
పలువురు మహిళలకు ప్రికాషన్ డోస్ టీకాను దగ్గరుండి వేయించారు.అనంతరం మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత కోవిడ్ టీకాను ప్రారంభిస్తున్నట్లు మంత్రి రజినీ పేర్కొన్నారు.18 ఏళ్లు నిండి ఇప్పటికే రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్న ప్రతి ఒక్కరూ మూడో విడత ప్రికాషన్ టీకా డోసును తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలు,అర్బన్ హెల్త్ సెంటర్లు,కమ్యూనిటీ సెంటర్లు,ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు,కోవిడ్ పంపిణీ కేంద్రాలలో కోవిడ్ టీకాను ప్రతి సోమవారం,ప్రతి శుక్రవారం ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందన్నారు.రాష్ట్రంలో బలమైన సచివాలయ వ్యవస్థ,వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేస్తుండడం వల్ల మిగతా రాష్ట్రాల కంటే కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ లో ముందు వరసలో ఉన్నామన్నారు.
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అన్నిచోట్ల కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రెండు డోసుల టీకాను అందించడం జరిగిందన్నారు.మూడో విడత కోవిడ్ టీకా డోసును సుమారు రెండు లక్షల మందికి పల్నాడు జిల్లాలో వేయడం జరిగిందన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మూడో విడత ప్రికాషన్ కోవిడ్ టీకాను తీసుకోవాలని సూచించారు.ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నీ సంప్రదించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ శోభారాణి,డి ఐ ఓ డాక్టర్ పద్మావతి,పురపాలక చైర్మన్ షేక్ రఫాని తదితరులు పాల్గొన్నారు.