గత కొన్నేళ్లలో సెలబ్రిటీల రెమ్యునరేషన్లు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి.టీవీ షోల కోసం, ఓటీటీ షోల కోసం నిర్మాతలు కళ్లు చెదిరే స్థాయిలో సెలబ్రిటీలకు ఆఫర్ చేస్తున్నారు.
అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో కాజోల్ ఒకరు. యంగ్ హీరోయిన్లకు అందం విషయంలో గట్టి పోటీ ఇస్తున్న హీరోయిన్ గా కాజోల్ కు పేరు, గుర్తింపు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కాజోల్ వయస్సు 47 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా కాజోల్ ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.పెళ్లికి ముందు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న కాజోల్ పెళ్లి తర్వాత సినిమాల సంఖ్యను తగ్గించారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం కాజోల్ ఒక షో చేస్తుండగా ఈ షో కోసం కాజోల్ ఏకంగా 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఈ థ్రిల్లర్ షోకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సుపర్ణ్ వర్మ ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ షోకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ షోకు కాజోల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.కాజోల్ ప్రస్తుతం సలామ్ వెంకీ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

కాజోల్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న కాజోల్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ లతో కచ్చితంగా విజయాలను సొంతం చేసుకుంటానని బలంగా నమ్ముతున్నారు.సినిమాసినిమాకు కాజోల్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కాజోల్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో సైతం మంచి గుర్తింపు ఉంది.