తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర పథకాలను ప్రజల చెంతకు చేర్చేందుకు బీజేపీ వ్యూహాన్ని ప్రకటించింది.పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ విభాగాలను కలుపుతూ వివిధ కేంద్ర మంత్రులు ప్రతి నాలుగు ఫంక్షనల్ క్లస్టర్‌లలో పని చేస్తారని తెలిపింది.
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించినట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
ఒక్కో క్లస్టర్‌లో మూడు లేదా నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయని… వీటిలో ప్రతి ఒక్కటి ఇంచార్జిగా కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారని… వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు వేర్వేరుగా నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.
కాగా, ప్రేమేందర్ రెడ్డిని పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమానికి కన్వీనర్‌గా నియమించారు.
కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీ వ్యవహరిస్తారు.కేంద్ర మంత్రులు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వివిధ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారాని తెలిపారు.
రాష్ట్ర నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించి బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.రాష్ట్రం నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు 10 మంది బీజేపీ నేతలను ఎంపిక చేయనున్నట్లు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
పింఛన్లు, ఉద్యోగాలు, 2బిహెచ్‌కె ఇళ్లు, అవినీతితో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైన అంశాలపై వారు అవగాహణ కల్పించనున్నారు.జిల్లా స్థాయి నాయకులు ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
అయితే పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ విభాగాలను కలుపుతూ వివిధ కేంద్ర మంత్రులు ప్రతి నాలుగు ఫంక్షనల్ క్లస్టర్‌లలో పని చేస్తారని బీజేపీ తెలిపింది.తెలంగాణ రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.