హైదరాబాదు నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ.ఇంకా కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు రావడం తెలిసిందే.
అయితే ప్రధాని మోడీని ఆహ్వానించడానికి సీఎం హోదాలో కేసిఆర్ విమానాశ్రయానికి వెళ్లకపోవడం పట్ల రకరకాల విమర్శలు వస్తున్నాయి.ఇదే సమయంలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలో ఒకరికి మరొకరు వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు కట్టడంతో పాటు ర్యాలీలు కూడా చేయడం జరిగింది.

ఈ పరిణామాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలపై సీరియస్ కామెంట్లు చేశారు.కేసీఆర్ అదే విధంగా మోడీ లోపాయికారి ఒప్పందంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.కార్పొరేట్ కంపెనీల డబ్బులతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తుందని అన్నారు.ఇందిరా గాంధీ విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టారని… ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.లేకపోతే కేసీఆర్, కేటీఆర్ వీపులకు కాంగ్రెస్ జెండాలు కడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.