మనం ఏదన్నా స్టార్ హోటల్ కి వెళితే, మన జేబులు నిండుగా ఉండాలి.లేదంటే అక్కడ బిల్లుల మోతకి మన కళ్ళు బైర్లు కమ్మకమానవు.
ఎందుకంటే బయట పది రూపాయలకు దొరికే.టీ అక్కడ వందల్లో పలుకుతుంది కాబట్టి.
ఇక బిర్యానీ వంటి ఆహార పదార్థాలయితే చెప్పనవసరం లేదు.ఆహారం కోసం అక్కడ వేల రూపాయలు ఖర్చు చేయాలి.
అదే మన ఇండియన్ రైళ్లలో మాత్రం ధరలు కాస్త అందుబాటులోనే ఉంటాయి.ఆ విషయం అందరికీ తెలిసినదే.కానీ తాజాగా ఓ ప్రయాణికుడు మాత్రం సింగిల్ టీకి ఏకంగా రూ.70 చెల్లించాల్సి వచ్చింది.ఇందులో టీ ధర రూ.20 కాగా.సర్వీసు చార్జీ కింద మరో రూ.50 వసూలు చేశారు.
వివరాల్లోకి వెళితే, జూన్ 28న ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి భోపాల్‌కు వెళ్లే శతాబ్ది రైలులో ప్రయాణించాడు.రైలు ప్రయాణ సమయంలో ఉదయం IRCTC సిబ్బంది వద్ద ఓ టీ తీసుకున్నాడు.వారు ఒక్క టీకి రూ.70 వసూలు చేయడంతో అతడు బిత్తరబోయాడు.మరీ ఇంత దారుణమా? ప్రయాణికులను దోచుకుంటున్నారని అని అతడు వారిని ప్రశ్నించగా, రైల్వే శాఖ చార్జీలు ఇలానే ఉన్నాయని సిబ్బంది చెప్పారు.రైలులో తనకు ఎదురైన అనుభవం గురించి ఆ వ్యక్తి జూన్ 29 ట్వీట్ చేసి, టీ బిల్లు యొక్క ఫొటోను కూడా జతచేసాడు.
ఇక దానికి నెటిజన్లనుండి విశేష స్పందన వచ్చింది.

ఈ క్రమంలో వారు రకరకాల కామెంట్లతో ట్విట్టర్ ని షేక్ చేసారు.“20 రూపాయల టీకి.50 రూపాయల ట్యాక్స్. దేశంలో చరిత్ర మాత్రమే మారిందనుకున్నా.అర్ధశాత్రం కూడా మారుగుతోందని.వ్యంగ్యంగా కామెంట్ చేసాడొక నెటిజన్.ఈ రకంగా ఆ ట్వీట్ చూసి చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దేశంలో అన్ని ధరలను పెంచేస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇక లేటుగా దీనిపై రైల్వే అధికారులు కూడా స్పందించారు.
ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదని చెప్పుకొస్తున్నారు.మరి అది ఏం లెక్కో మిరే చెప్పండి.