బట్టతల వ‌స్తుందేమో అని భ‌య‌ప‌డుతున్నారా? అయితే ఇలా చేయండి!

ఒక‌ప్పుడు అర‌వై, డ‌బ్బై ఏళ్ల పురుషుల్లో మాత్ర‌మే బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య క‌నిపించేది.కానీ, నేటి టెక్నాల‌జీ కాలంలో ముప్పై ఏళ్ల వారు సైతం బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.

 Following These Powerful Tips Will Prevent Bald , Powerful Tips, Bald, Men, Hai-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, జుట్టుకు సరైన కేర్ తీసుకోకపోవడం, కాలుష్యం, ల్యాప్‌టాప్స్ ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు క్ర‌మంగా ఊడిపోయి బ‌ట్ట‌త‌ల ఏర్ప‌డుతోంది.అందుకే పురుషులు జుట్టు అధికంగా రాలుతుందంటే ఎక్క‌డ బ‌ట్ట‌త‌ల వ‌స్తుందో అని తెగ భ‌య‌ప‌డుతుంటారు.

ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను ప్ర‌య‌త్నిస్తే.హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవ‌చ్చు.అదే స‌మ‌యంలో బ‌ట్ట‌త‌ల రాకుండా అడ్డుకోనూవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి, ఐదు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి గంట పాటు వ‌దిలేయాలి.

ఆపై మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.ఇలా చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

త‌ద్వారా బ‌ట్ట‌త‌లకు దూరంగా ఉండొచ్చు.

Telugu Bald, Care, Care Tips, Latest, Powerful Tips-Telugu Health Tips

అలాగే మ‌రో రెమెడీ ఏంటంటే.స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ల‌వంగాలు, వ‌న్ టేబుల్ స్పూన్ మిరియాలు, వ‌న్ టేబుల్ స్పూన్ క‌లోంజి సీడ్స్ వేసి వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ల‌వంగాలు, మిరియాలు, క‌లోంజి సీడ్స్‌ను మిక్సీ జార్ లో వేసి మెత్త‌గా పొడి చేయాలి.

ఈ పొడిని ఒక క‌ప్పు నువ్వుల నూనెలో వేసి బాగా మ‌రిగించి.ఆపై ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్‌తో త‌ల‌కు మ‌సాజ్ చేసుకుని.ఉద‌యాన్నే హెడ్ బాత్ చేయాలి.

ఇలా చేసినా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.బ‌ట్ట‌త‌ల రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube