ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు నరేష్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా నరేష్ పేరు సోషల్ మీడియాలో మారి మోగిపోతోంది.
కాగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య ఏదో ఉంది అంటూ కథ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇదే విషయంపై నరేష్ మూడో భార్య రఘుపతి కూడా స్పందించిన విషయం తెలిసింది.
అయితే నరేష్ జెంటిల్మెన్ అనే పవిత్ర లోకేష్ అంటుండగా కాదు నరేష్ మంచివాడు కాదు, తనని బెదిరించాడని మూడో భార్య రమ్య రఘుపతి అంటుంది.
ఈ విషయంలో పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర రంగంలోకి దిగి ఆమెకు కొంపలు కూల్చడం అలవాటు అని అనడంతో ముగ్గురు చుట్టూ తిరిగే ఈ వ్యవహారం కాస్త నలుగురి వ్యవహారంగా మారింది.
అయితే పవిత్ర లోకేష్ నరేష్ విషయంలో వార్తలు వినిపించడంతో తాను ఉండగా తనతో విడాకులు తీసుకోకుండా మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ కేవలం ఆమె పాపులాట కోసం ఇలాంటి వేషాలు వేస్తోందని ఆమెకు ఏమైనా సమస్యలు ఉంటే హైదరాబాదులోనే తేల్చుకోవాలి కానీ ఇక్కడ బెంగళూరుకు వచ్చి తనను టార్గెట్ చేయడం ఏంటి అంటూ పవిత్ర లోకేష్ నిలదీసింది.

అయితే తనకు విడాకులు వద్దని తాను తన సంసారాన్ని చెక్క దిద్దుకోవాలి అనుకుంటున్నట్టు రమ్య రఘుపతి తెలిపిన విషయం తెలిసిందే.అయితే విడాకుల కోసం నరేష్ తనని గన్ను పెట్టి మరీ బెదిరించాడు అంటూ బాంబు పెల్చింది రమ్య రఘుపతి.అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి విజయనిర్మల గారికి తెలుసు అంటూ విజయనిర్మల గారు చనిపోయే చివరి ఉగాది రోజు కూడా మాట్లాడారు అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.ఇంట్లో నుంచి వెళ్లవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నారు అంటూ విజయనిర్మల గురించి రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఈ వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో చిలికి చిలికి గాలి వానగా మారింది.