మన పెద్దలు ఎప్పుడు మనకు చెబుతూ ఉంటారు.దానాలలోకెల్లా అన్నదానం, రక్తదానం చాలా గొప్పవి అని.
అన్నదానం సాటి మనిషి కడుపు నింపితే రక్త దానం సాటి మనిషి ప్రాణాలను నిలబెడుతుంది అని.మన రక్తం సాటివారికి దానం చేయడం.అంటే దరిదాపుగా వారికి ప్రాణ దానం చేయడం లాంటిది.అలా రక్తదానం చేసి ఒక మహిళ ఏకంగా రికార్డు సృష్టించారు.ఒకసారి కాదు… రెండు సార్లు కాదు ఏకంగా 117 సార్లు రక్తదానం చేసి తనలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.ఒక పక్క రక్తదానం చేస్తూనే మరోపక్క సామాజిక సేవలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.
పక్కవాడు ఎలా పోతే నాకెంటని అనుకునే ఈ రోజుల్లో సాటి మనిషి గురించి అలోచించి ఎందరో ప్రాణాలను నిలబెట్టారు మధుర అశోక్ కుమార్.
రక్తం అనేది కొన్ని అత్యవసర పరిస్థితులలో ఎన్ని డబ్బులు ఇచ్చినా గాని కొన్ని సార్లు సమయానికి దొరకదు.
ఫలితంగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.అలాంటి పరిస్థితుల నుంచి కనీసం కొందరి ప్రాణాలను అయినా కాపాడవచ్చు అనే ఒక గొప్ప సంకల్పంతో మధుర అశోక్ కుమార్ 117 సార్లు రక్తదానం చేసారు.
కర్ణాటక లోని బెంగళూరుకు చెందిన మధుర అశోక్ కుమార్ అనే మహిళ 117 సార్లు రక్తదానం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేవారు.
ఆమె చేసిన సేవలకుగాను దాదాపుగా ఆమెకు180కి పైగా అవార్డులు వచ్చాయి.
అలాగే తుమకూరులోని సిద్ధగంగ మఠంలోని వేలాది మంది చిన్నారులకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలను కూడా కల్పిస్తున్నారు.తాజాగా మధుర అశోక్ కుమార్ తుమకూరులోని సిద్ధగంగమఠాధిపతి సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పుకోచ్చారు.
నాకు ఇలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే నేను ఎటువంటి రికార్డుల కోసం రక్తదానం చేయలేదని.
నా తండ్రి, మామయ్య స్వాతంత్ర్య సమరయోధులు.వారిని స్ఫూర్తిగా తీసుకున్నాను కాబట్టే నాకు పుట్టినప్పటి నుండి సామాజిక సేవ అలవాటైంది.
నా 18 ఏళ్ల వయసు నుంచే నేను రక్తదానం చేయడం ప్రారంభించానని చెప్పుకోచ్చారు.నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఇలానే రక్త దానం చేస్తా అన్నారు మధుర అశోక్ కుమార్.