పక్షి ప్రాణాలు కాపాడబోతుండగా ఊహించని ఘటన.. ఇద్దరు మృతి

రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో మనం ఊహించలేం.

 Two Members Died While Saving The Life Of A Bird In Mumbai Details, Bird, Saving-TeluguStop.com

మనం జాగ్రత్తగా ఉన్నా సరే.మిగతా వాహనదారులు అజాగ్రత్తగా ఉన్నా.అది కూడా మనకే ప్రమాదం.అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి.ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తే చివరకు ప్రాణాలే గాల్లోకి పోతాయి.దేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు మరింతగా పెరిగిపోయాయి.

దేశంలో రోజు ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.రోడ్లు రక్తసిక్తం అవుతూనే ఉన్నాయి.

అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించాలని ప్రయత్నిస్తే ఒక్కొసారి అది మన ప్రాణాలకే మీదకే వస్తుంది.ఇలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటుచేసుకుంది.రోడ్డుపై పక్షిని కాపాడబోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ మార్గంమధ్యలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మే 30న జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అమర్ మనీష్ జరీవాలా అనే బిజినెస్ మెన్ రోడ్డుపై కారులో వెళ్తున్నారు.అయితే ఒక పక్షి ఆయన కారును ఢీకొట్టి కింద రోడ్డుపై పడింది.దీంతో పక్షిని రక్షించేందుకు మనీష్ జరీవాలా కిందకు దిగాడు.

Telugu Bird, Mumbai, Socialmedia, Taxiravindra, Taxi Hits, Latest-Latest News -

వంతెనపై రోడ్డు పక్కన కారు ఆపి పక్షిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఇంతలో ఊహించని ఘటన జరిగింది.

రోడ్డుపై వెళ్తున్న ఒక ట్యాక్సీ జరీవాలాను, అతడి డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మరణించారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపు దుర్మరణం పాలయ్యారు.ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర జైశ్వర్ర పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube