మనకి మన ఇంటిలో మనిషి ఎప్పుడూ అందంగా కనిపించదు.ఎదుటి వాడి ఇంట్లో ఆవిడ చాలా అందంగా కనబడుతుంది.దోషం చూసే చూపులోనే ఉంటుంది.అవును… మనలో చాలామందికి ఫారిన్ అంటే చాలా క్రేజీగా ఉంటుంది.అదొక అందమైన లోకం అని భ్రమ పడుతూ వుంటారు.మనచుట్టూవున్న పరిసరాలను మాత్రం వారు ఎంజాయ్ చేయలేరు.ఎందుకంటే వాడికి చూడటం చేతకాదు కనుక.ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకంటే, మనదగ్గర కూడా ఫారిన్ లొకేషన్స్ కి తలదన్నే రీతిలో అందమైన లొకేషన్స్ వున్నాయి.
అయితే వాటిని ఎవరూ సరిగ్గా పట్టించుకోరు.అందుకే ఇపుడు అలాంటి లొకేషన్ గురించి తెలుసుకుందాం.
ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, అద్భుత కట్టడాలు మన దేశంలో వున్నాయి.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఇక్కడ మీరు చూస్తున్న చిత్రం.అవును.అదేదో ఫారెన్ టూరిస్ట్ స్పాట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే, ఇది నిజంగా మన దేశంలోనిదే.ఆకాశం పూర్తిగా నీలిరంగు ఆవహించిన సమయంలో ఓ ప్రకృతి ప్రేమికుడు తీసిన చిత్రం ఇది.ఇప్పుడు నెట్టింట్లో నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్ హీమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ అందమైన ఫోటోని షేర్ చేయగా సోల్ హీమ్ అక్కడి ప్రకృతి అందానికి నెటిజన్లు మంత్రముగ్దులైనట్లు చెబుతున్నారు.

ఈ సిమ్లా చిత్రాన్ని ట్వీట్ చేస్తూ, అతడు… “ఇది యూరప్ కానే కాదు, క్లీన్ అండ్ గ్రీన్ సిమ్లా” అనే ట్యాగ్‌లైన్ జోడించాడు.ఇంత బ్యూటీఫుల్ ఫోటోని షేర్ చేసిన నార్వేజియన్ దౌత్యవేత్తకు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.67ఏళ్ల ఎరిక్ సోల్‌హీమ్ నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త.అతను 2005 నుండి 2012 వరకు నార్వే ప్రభుత్వంలో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా, పర్యావరణ మంత్రిగా పనిచేశారు.2016 నుండి 2018 వరకు ఐక్యరాజ్యసమితి అండర్-సెక్రటరీ-జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఈ క్రమంలోనే అతను కర్ణాటకలోని ఉడిపిలోని బీచ్‌సైడ్ రోడ్ అందమైన చిత్రాన్ని కూడా పంచుకున్నాడు.దీన్ని ‘ప్రపంచంలోని అత్యంత అందమైన సైక్లింగ్ మార్గం’ అంటూ అప్పట్లో ట్విట్ చేశారు.