తాజాగా ఒక అత్తయ్య తన కోడలిపై వింత పిటిషన్ వేసింది.బహుశా న్యాయవ్యవస్థలో ఇలాంటి పిటిషన్ వేయడం ఇదే తొలిసారేమో! తన కోడలు,కొడుకులు కలిసి ఏడాదిలోగా మనవడు లేదా మనవరాలును తనకి కనివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
ఆమె ప్రకారం, కొడుకు కోడలు డబ్బు యావలో పడి పిల్లలను కనేందుకు ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదట.పైగా కొడుకు తన భార్యతో కలిసి తల్లికి దూరంగా ఉంటున్నాడట.
అయితే ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకును కోడలు దూరం చేయడంతో తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని ఆమె అంటోంది.తన కొడుకు, కోడలు మనవడు లేదా మనవరాలకు జన్మనిచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆమె హరిద్వార్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించింది.
తమ మానసిక వేదనకు పరిహారం పొందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది.
ఈ అత్త తన లాయర్ ఎ.కె శ్రీవాస్తవ ద్వారా కొడుకు, కోడలుపై రూ.5 కోట్ల దావా కోర్టులో దాఖలు చేసింది.తన కుమారుడి చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేసానని ఆమె చెబుతోంది.అంతే కాదు, కొడుక్కి నచ్చినట్లుగా అతన్ని పైలట్‌గా చేశానని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.2016లో తన కుమారుడి పెళ్లిని చాలా డబ్బుతో ఘనంగా జరిపించాలని.తన సొంత డబ్బులతోనే వారిని హనీమూన్‌కి థాయ్‌లాండ్‌కు కూడా పంపించానని ఆమె వెల్లడించింది.

అయితే పెళ్లి తర్వాత, కోడలు తన కొడుకును హైదరాబాద్‌కు మాకం మార్చాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది.అప్పటి నుండి తన కొడుకు, కోడలు అస్సలు మాట్లాడటం లేదని ఆమె వాపోయింది.కోడలు కుటుంబం తన కొడుకు జీతం మొత్తం తీసుకుంటుందని… ప్రతి నిర్ణయంలో వారి కుమార్తెకే మద్దతు ఇస్తుందని ఆమె తన పిటిషన్ లో చెప్పుకొచ్చింది.కొడుకు, కోడలు ఏడాదిలోపు బిడ్డను కనేలా ఆదేశించాలని, లేకుంటే వారు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోర్టులో ఆమె దావా వేసింది.అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.