ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లకుంటే ఇంకా రెండేళ్లు సమయం ఉంది.కానీ ఏపీలో రాజకీయ సమీకరణాలు అప్పుడే ఎన్నికలు అన్నంతా అడావుడి చేస్తున్నాయి.
అప్పుడే అన్ని లెక్కులు వేసుకుంటున్నాయి.అధికార పక్షం కూడా సర్వేలు చేయించుకోవడం.
జగన్ ఉత్తరాంధ్రలో పర్యటించడం విశేషం.అదే స్థాయిలో టీడీపీ కూడా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది.
మరో అడుగు ముందుకేసి పొత్తులు పెట్టుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పింది.ఇక జనసేన అధినేత ప్రజల్లో ఉంటూ రైతులుకు తన చేతనైన సాయం చేస్తున్నారు.
అయితే పొత్తుల పంచాయితీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ అందరం కలిసి వెళ్దాం.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకుందాం.అని బహిరంగంగానే అంటున్నా జనసేన ఎలాంటి క్లారిటీ ఇవ్వడంలేదు.
నిజానికి జనసేన కూడా జగన్ ప్రభుత్వాన్ని మళ్లి రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది.అయితే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తే అది సాధ్యపడుతుందా.
ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా.అనే విషయాల్లో అధినేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.2014లో జనసేన పోటీ చేయకపోయినా టీడీపీతో కలిసి పనిచేసింది.దీంతో టీడీపీకి కూడా కలిసి వచ్చి అధికారం చేజిక్కించుకుంది.
అయితే 2019లో మాత్రం జనసేన పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగగానే బరిలోకి దిగింది.కానీ ఏకంగా అధినేతనే ఓడిపోయి కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకున్నారు.
అయితే అప్పటికీ.ఇప్పటికీ జనసేన మెరుగైందని చెప్పవచ్చు.

ప్రజల్లో మరింత పట్టు సాధించి బలంగా ఎదుగుతోంది కూడా.సమస్య వచ్చినప్పుడల్లా ప్రజల్లోకి వెళ్లి పవన్ బలంగానే పోరాడారని కూడా చెప్పవచ్చు.జనసేన అధినేత ఎప్పటికప్పుడు జనాల్లో ఉంటూ ఎక్కడ ఏ ఆపద ఉన్నా అక్కడికి చేరుకుని ప్రజలకు అండగా ఉంటున్నారు.రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నిస్తూనే కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున 30 కోట్ల వరకు తన సొంత డబ్బుతో సాయం అందించి అండగా నిలిచారు.
ఇలా ఇప్పటి వరకు ఏక్కడా ఏ నాయకుడు చేయలేదు.రైతు కష్టాలు తెలిసిన వాడిగా రైతులను ఆదుకోవాడానికి ముందుకొచ్చానని రాజకీయం చేయటానికి కాదని కుండ బద్దలు కొట్టారు.
దీంతో జగన్ ప్రభుత్వం కూడా కౌలు రైతులపై స్పందించేలా చేశాడు.

అయితే ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తే 70 సీట్లకు పైగా విజయం సాధిస్తామని జనసేన నమ్ముతోంది.అయితే పొత్తులు కూడా ఉండబోవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.పవన్ కూడా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ముందుకు కదలడంతో ప్రజల్లో విశ్వాసం ఏర్పడినట్లు భావిస్తున్నారు.
అయితే జనసేన కార్యకర్తలు కూడా పొత్తును వ్యతిరేకిస్తుండటంతో ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.