రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రోజే ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.శనివారం నాటికి ఈ సినిమా కలెక్షన్లు మరింత తగ్గాయి.
అయితే ఆచార్య సినిమాకు భారీ ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది.సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు స్క్రీన్లు తగ్గనున్నాయని ఈ సినిమా థియేటర్లలో కేజీఎఫ్2 సినిమాను ప్రదర్శించనున్నారని సమాచారం అందుతోంది.
ఆచార్యకు ఇది ఒక విధంగా షాకేనని చెప్పాలి.వీకెండ్ లోనే ఆచార్య సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఆచార్య రెండో రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల హవా కూడా తగ్గింది.అయినప్పటికీ ఆచార్య థియేటర్లలో ఈ సినిమాలను ప్రదర్శించాలని మేకర్స్ భావిస్తున్నట్టు బోగట్టా.
మరోవైపు ఆచార్య ఫ్లాప్ పై మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.ఆచార్య ఫ్లాప్ కు సంబంధించి మెగా అభిమానులు మాత్రం కొరటాల శివను నిందిస్తున్నారు. కొరటాల శివ కథ విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండి ఉంటే ఫలితం ఈ విధంగా ఉండేది కాదని వాళ్లు చెబుతున్నారు.
ఆచార్య ప్రభావం కొరటాల భవిష్యత్తు సినిమాల బిజినెస్ లపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
చిరంజీవి, చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకుంటే మాత్రం ఏ సమస్య ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కథల జడ్జిమెంట్ విషయంలో ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి ఆచార్య లాంటి రొటీన్ కథకు ఏ విధంగా ఓకే చెప్పారో అర్థం కావడం లేదు.ఆచార్య ఫ్లాప్ నుంచి కాజల్ తప్పించుకోవడంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం సంతోషిస్తున్నారు.
ఆచార్య మూవీ నష్టాలు కూడా భారీగానే ఉండబోతున్నాయని సమాచారం.