నేటి సమాజం ఎటు పోతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు.
మనం ప్రవర్తిస్తున్న తీరు సరైనదేనా? కాదా? అని ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు.ఇలా చాలా మంది చాలా రకాల దారుణాలు చేయడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం.
అయ్యో ఏంటిది? ఈ సమాజం ఎటు పోతుంది అని బాధపడుతూనే ఉన్నాం.తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలో జరిగింది.బడి… దానినో గుడిలా భావిస్తారు చాలా మంది.ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోలేని సమస్యలను కూడా బళ్లో పంతుళ్లతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ బడిలో పంతులు ప్రవర్తించిన తీరును చూస్తే మనకే ఒళ్లు జలదరిస్తోంది.పంతులు కదా ఏం చేస్తే ఏమవుతుందో అని ఆ అన్యం పుణ్యం తెలియని చిన్నారులు చాలా రోజుల పాటు ఓపిక పట్టారు.
ఇక చివరికి వారి ఓపిక నశించి హెడ్ మాస్టర్ కు కంప్లైంట్ చేశారు.ఆ కీచక ఉపాధ్యాయుడి బాగోతం మొత్తం బయటపడింది.
చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. చిల్ల గుండ్ల పల్లి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 58 సంవత్సరాల అబు అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో 4,5 వ తరగతి చదువుతున్న చిన్నారులను వేధిస్తూ ఇన్ని రోజులూ పబ్బం గడిపాడు.
కానీ చాలా రోజులకు అతడి పాపం పండింది.ఇంతకాలం అతడి వికృత చేష్టలను భరించిన ఆ చిన్నారులు ఇక ఈ వేధింపులు తమ వల్ల కావని అబు గురించి ఫిర్యాదు చేశారు.
తాను చేసే ఈ చేష్టలను ఎక్కడైనా బయట చెబితే టీసీ ఇస్తానని బెదిరించినట్లు కూడా విద్యార్థినిలు చెబుతున్నారు.తమను అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేశాడని వాపోతున్నారు.