షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో..!

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో హీరో గోపీచంద్ స్లిప్ అయ్యి కిందపడ్డారని తెలుస్తుంది.

 Gopichand Injure In Shooting Location,hero Gopichand,pakka Commercial,raashi Kha-TeluguStop.com

యాక్షన్ సీన్ చేస్తున్న టైం లో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది.వెంటనే ఆయన్ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అయితే గోపీచంద్ కి గాయాలు అనగానే ఫ్యాన్స్ కంగారుపడ్డారు.చిత్రయూనిట్ కంగారు పడాల్సింది ఏమి లేదని హీరోకి ఎలాంటి గాయాలు తగల్లేదని క్లారిటీ ఇచ్చారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమయ్యారు శ్రీవాస్, గోపీచంద్.ఆల్రెడీ ఈ కంబినేషన్ లో వచ్చీ లక్ష్యం, లౌఖ్యం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ చేస్తూ అదే ఫలితాన్ని పొందాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో కూడా గోపీచంద్ నటిస్తున్నారు.

పక్కా కమర్షియల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోని గోపీచంద్ ఈ రెండు సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube