వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి,'ఎఫ్3' సెకండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా' విడుదల

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ కంటెంట్ తో అంచనాలని భారీగా పెంచుతుంది.డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3′ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Second Single-TeluguStop.com

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు.

సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.ఆ.ఆహా.ఆహా.ఆహా’ పాటని ఈ రోజు విడుదల చేసింది.వూ.

ఆ.ఆహా.ఆహా.ఆహా’ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ డిఫరెంట్ అండ్ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేశారు.వినగానే హుషారుగా డ్యాన్స్ చేయాలనిపించే విధంగా పాటని డిజైన్ చేశారు.తమన్నా, మెహ్రీన్ గ్లామర్ అండ్ స్పైసీ డ్యాన్స్ తో కనువిందు చేశారు.చీరలో సొగసుగా కనిపించి వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్‌ గా కథానాయకులతో కెమిస్ట్రీ అదరగొట్టారు.మూడో హీరోయిన్‌గా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా ఈ పాటలో అలరించింది.

సునీల్ డ్యాన్సులు ఈ పాటకు అదనపు ఆకర్షణ.

ఈ వీడియోలో పాటని చిత్రీకరిస్తున్నపుడు లెజెండరీ దర్శకులు కె రాఘవేంద్రరావు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెట్స్‌ కు విచ్చేసిన విజువల్స్‌ను కూడా చూపించారు.ఈ పాటకు శేఖర్ విజే అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.‘వూ.ఆ.ఆహా.ఆహా”పాట దేవిశ్రీ ప్రసాద్ తన రాకింగ్ కంపోజింగ్ తో ఇన్స్టెంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది.పాటని ఎప్పుడెప్పుడు వెండితెర చూడాలనే ఆసక్తిని పెంచింది.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

తారాగణం:

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత : శిరీష్, బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డివోపీ: సాయి శ్రీరామ్, ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ : తమ్మిరాజు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube