లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.టక్ జగదీష్ తో నిరాశపరచిన శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది.
ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి మహానటి సినిమాలో నటించారు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఏప్రిల్ 20న ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తుంది.నెక్స్ట్ డే నుండే అంటే ఏప్రిల్ 21 నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ అయిన ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ సినిమా వస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేగా ఉంటుందని చెప్పొచ్చు.
మరి ఆ సినిమా లానే సూపర్ హిట్ లవ్ స్టోరీగా ఈ మూవీ కథ ఉంటుందేమో చూడాలి.