రాబోయే రోజుల్లో అరటి, బేబీ కార్న్ పంటలకు మంచి ఊపు..

అరటి, బేబీ కార్న్ పండించే రైతులు రానున్న రోజుల్లో తమ పంటలకు మంచి ధర అందుకోనున్నారు.ఈ రెండు పంటల ఎగుమతి కోసం భారతదేశం.

 India Gets Open Market Access For Banana And Baby Corn Details, Banana, Baby Cor-TeluguStop.com

కెనడాతో ఒప్పందం చేసుకుంది.పంటల ఎగుమతులకు సంబంధించి భారత్, కెనడాల మధ్య ఒప్పందం కుదిరింది.

కెనడా ప్రభుత్వం తాజాగా అరటిపండ్లు, బేబీ కార్న్‌ ఎగుమతి చేయడానికి అనుమతించిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.సాంకేతిక నవీకరణ తర్వాత కెనడాకు అరటి, బేబీ కార్న్ ఎగుమతి ఈ నెల నుంచే ప్రారంభంకానుంది.

ఈ రెండు పంటల ఎగుమతితో రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.కెనడా మార్కెట్‌లో అరటిపండ్లు, బేబీ కార్న్ విక్రయించేందుకు భారత్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి.నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, కెనడా ప్రభుత్వం ఎగుమతుల గురించి చర్చించాయి.ఈ ఒప్పందం తర్వాత భారత్ నుంచి కెనడాకు తాజా బేబీ కార్న్ ఎగుమతి ఈ నెల నుంచే ప్రారంభంకానున్నదని కెనడా తెలియజేసింది.అలాగే భారతీయ అరటిపండ్లను కెనడాకు ఎగుమతి చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది.

దీనితో పాటు, తాజా అరటిపండ్ల కోసం భారతదేశం అందించిన సాంకేతిక సమాచారం ఆధారంగా కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పంటలు పండించే భారత రైతులకు ప్రయోజనం చేకూరనుంది.అదేవిధంగా భారతదేశ ఎగుమతుల ఆదాయం కూడా పెరగనుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube