ఓ ఆడబిడ్డను అన్నగా ఆదుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి జిల్లా:ఓ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000/-ఆర్థికసాయం అందించి తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆ కుటుంబాన్ని అన్నలాగా ఆదుకున్నారు.తుంగతుర్తి నియోజికవర్గ పరిధిలోని మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి చెందిన పిల్లలమర్రి వెంకటేష్ రాణి దంపతుల కుమార్తె జయ వివాహ వేడుకకు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ని ఆహ్వానించారు.వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వారి కుటుంబ పరిస్థితిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకొని చలించిపోయారు.ఆ పేదింటి ఆడబిడ్డ వివాహం ఖర్చుల కొరకు ఆయన తన వంతు సహాయంగా రూ.50,000/-(యాభై వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఎమ్మెల్యే మంచి మనసుకు కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

 An Mla Who Defended A Girl Child As An Aunt-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube