భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది, మండల పరిధిలోని శ్రీనగర్ పంచాయతీ నాల్గవ లైన్ ముర్రేడు వాగులో అప్పుడే పుట్టిన శిశువు ను గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.వాగులో పడేసిన మగ శిశువు ను కుక్కలు బయటకు తీసుకురావడంతో అటుగా వెళ్తున్న కొందరు శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో అక్కడికి చేరుకున్న లక్ష్మీదేవి పల్లి పోలీసులు మగ శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.శిశువును అక్కడికి ఎవరు తీసుకువచ్చారు, ఎలా వచ్చింది, ఎన్ని రోజులు అవుతుంది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.