టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అరవింద్ కుమారులు అల్లు అర్జున్, అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే.
ఇక అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అయిన అల్లు బాబీ గురించి చాలా మందికి తెలియదు.ముగ్గురు కుమారులలో ఇద్దరు హీరోలుగా మారగా పెద్ద కుమారుడు అల్లు బాబీ మాత్రం నిర్మాతగా మారాడు.
అయితే టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమాకు అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇకపోతే అల్లు బాబి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తమ్ముడు అల్లు అర్జున్ కెరీర్ లో బన్నీ నిరాశపరిచిన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.అల్లు అర్జున్ దీక్షకు దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తుంటాడని, ఈ క్రమంలోనే నా పేరు సూర్య సినిమా ఫై బోలెడు ఆశలు పెట్టుకోగా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో, అల్లుఅర్జున్ దాదాపుగా రెండేళ్లపాటు సినిమాలు చేయలేదని అల్లు బాబి చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఆ సినిమా తరువాత అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకున్నాడని, ఆ సమయంలోనే తనకు అలా వైకుంఠపురం లో సినిమా వచ్చింది అని అల్లు బాబీ తెలిపాడు.

ఇక అల్లు అర్జున్ విషయానికివస్తే అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.పుష్ప ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఇక పుష్ప సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే పుష్ప పార్ట్ 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరించిన గని సినిమా విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.