క్షేత్ర స్థాయిలో బీజేపీ పాదయాత్రల వ్యూహం... అసలు వ్యూహం ఇదేనా

తెలంగాణలో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం ఉన్నా ఎన్నికల్లో విజయం సాధించాలంటే క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా బలపడాల్సి ఉంటుంది.

 Telangana Bjp Padayatra Strategy At Field Level Will It Work Details, Bjp Party,-TeluguStop.com

అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని సమస్యలే లక్ష్యంగా పాదయాత్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.ప్రస్తుతం కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా నాయకులు పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన ప్రాణహిత జలసాధన పాదయాత్రను చేపట్టారు.

ప్రాణహిత నీటిలో వాటా విషయమై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పాదయాత్రను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.

కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత బలమైన నేతగా పేరొందిన పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరిక తరువాత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు నడుస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా బీజేపీ క్షేత్ర స్థాయి పాదయాత్ర వ్యూహం ఇప్పడు రాజకీయ వర్గాలలో సరికొత్త చర్చకు దారి తీస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాక బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని బలంగా భావిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు ఎప్పటి నుండో నెరవేరాలని భావిస్తున్న సమస్యలను బీజేపీ తమ పాదయాత్రల ద్వారా తీసుకెళ్లడం ద్వారా ప్రజల మద్దతు కూడా దక్కే అవకాశం కనిపిస్తోంది.

Telugu @bandisanjay_bjp, Bandi Sanjay, Field Level, Kagajnagar, Telangana Bjp, T

తద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు బీజేపీ దగ్గరవడంతో పాటు టీఆర్ఎస్ పై బీజేపీ ప్రయోగిస్తున్న వ్యూహాలు సఫలమయ్యే అవకాశం ఉంది.దీంతో ద్విముఖ వ్యూహంతో రాష్ట్రమంతా ఇలానే ముందుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం చాలా వరకు క్షేత్ర స్థాయిలో బలం లేని నియోజకవర్గాలలో కాస్త చురుకుగా ఉన్న నేతలను ఎంకరేజ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రచారకర్తలుగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది.మరి బీజేపీ పాదయాత్రల వ్యూహం ఎంత మేరకు బీజేపీ క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదపడుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube