లెక్కల మాస్టారు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.అప్పటి వరకు రొటీన్ సినిమాలను చేసుకుంటూ పోతున్న రామ్ చరణ్ కు రంగస్థలం సినిమాతో తన లోని నటనను బయటకు తీసి మెగాస్టార్ వారసుడు అంటే ఇలా ఉంటాడు అని నిరూపించాడు.
ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ పుష్ప సినిమా చేసాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు.
ఈ సినిమాతో సుకుమార్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమాతో తనని తాను మరోసారి నిరూపించు కున్నాడు.
ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈయన దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మీద తన ధ్యాస మొత్తం పెట్టేసాడు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే ఇప్పుడు చిరంజీవి కూడా సుకుమార్ దర్శకత్వంలో నటించారు.అయితే ఇది సినిమా మాత్రం కాదు.
ఇది ఒక యాడ్ ఫిలిం సుకుమార్ దర్శకత్వం వహించిన యాడ్ లో చిరు నటించారు.
శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీ కి చెందిన ప్రకటన ను సుకుమార్ తెరకెక్కించగా చిరంజీవి ఆ యాడ్ లో నాయించాడు.ఈ యాడ్ షూట్ తర్వాత చిరు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ సుకుమార్ ను పొగిడారు.దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే.
ఓ యాడ్ ఫిలిం కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు అంటూ తెలిపారు.
దీనికి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.