ప్రస్తుతం సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించే హీరోలందరూ కేవలం 100 రూపాయలతో టికెట్ పెట్టుకొని థియేటర్ కి వెళ్తున్న ఒక సామాన్య ప్రేక్షకుడికి కారణంగానే బ్రతుకుతున్నారు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి నప్పుడు ఇక ఆ డబ్బులతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు హీరోలు నిర్మాతలు.
అయితే సాధారణంగా ప్రతి హీరోకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఎంతో మంది పోస్టులు పెడుతూ విమర్శలు కూడా ఛేసుకుంటున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ మూవీ రాధేశ్యాం ఫ్లాప్ గా మిగిలిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై ఇప్పటికే అభిమానులు అన్వేషణ సాగిస్తున్నారు అని చెప్పాలి.అయితే భీమ్లా నాయక్ సినిమాకు వసూలు తగ్గాయని అటు ప్రభాస్ రాధేశ్యాం సినిమాకి కూడా నెగిటివ్ టాక్ ప్రచారం చేశారని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.
దీంతో మా హీరోకి అలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారా అంటూ ప్రభాస్ అభిమానులు రెచ్చిపోతున్నారు.
ప్రభాస్ అల్లు అర్జున్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.
కానీ ఇద్దరు హీరోల అభిమానులు తరచూ గొడవలు పడుతూ ఉన్నారు.ఇక చిన్న లింకు దొరికిందంటే చాలు సోషల్ మీడియాలో హద్దులు దాటే మాటలతో ఎంతోమంది ప్రభాస్ అభిమానులు బన్నీ అభిమానులను విమర్శిస్తున్న ట్లు తెలుస్తోంది అయితే కొంతమంది ఇంకా వార్నింగ్ లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇస్తున్నారట.కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల ఫ్యాన్స్ కూడా కొంతమంది హీరోల అభిమానులు ఇలాగే పోట్లాడుకుంటున్నారు.మా హీరో మాత్రమే గొప్ప అంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
మరీ ముఖ్యంగా మొన్నటికిమొన్న కర్ణాటకలో బాయ్ కాట్ త్రిబుల్ ఆర్ అంటూ ఒక ఫాస్టాగ్ వైరల్ గా మారిపోయింది.అయితే ఇక దీనిపై చరణ్ తారక్ అభిమానులకు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.మీరు ఇలాగే చేస్తే ఇక కే జి ఎఫ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆడుతుందో మేము కూడా చూస్తాం అంటూ సవాల్ విసురుతున్నారు.అదే సమయంలో మరి కొన్ని రోజుల్లోనే అటు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అదేసమయంలో త్రిబుల్ ఆర్.సినిమా లో ఎన్టీఆర్ బాగా నటించాడని కొంతమంది లేదు చరణ్ ఇరగదీశాడు అని మరికొంతమంది ఇక బాలీవుడ్ రేంజ్ లో లేదు అంటూ మరికొంతమంది సోషల్ మీడియాలో ఎవరికి వారు పోస్టులు పెడుతూ ఉండటం గమనార్హం.